పాకిస్థాన్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన హిందూ యువతి.. అభినందనల వెల్లువ..!


ఓ వైపు పాకిస్థాన్ లో మైనారిటీలను ఎంతగా హింసిస్తున్నారో రోజుకో ఘటన బయటకు వస్తోంది. సిక్కులను, హిందువులను అణగతొక్కడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ హిందూ మహిళ పాకిస్థాన్ లో సంచలనం సృష్టించింది.   
పాకిస్థాన్‌లో పోలీస్ ఉద్యోగం సాధించిన తొలి హిందూ యువతిగా రికార్డు సృష్టించింది. పుష్పా అనే యువతి ఇటీవల సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఏఎస్సైగా ఎంపికైంది. సింధ్ ప్రావిన్స్‌లో ఇకపై ఆమె ఉద్యోగం నిర్వర్తించనున్నారు. పాకిస్థాన్‌లో పోలీస్ ఉద్యోగం సాధించిన తొలి హిందూ యువతిగా పుష్ప రికార్డులకెక్కారని మానవ హక్కుల కార్యకర్త కపిల్ దేవ్ ట్వీట్ చేశారు. పుష్పా పలువురు అభినందనలు తెలియజేసారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు