ఎవడన్నాడు నువ్వు ఓడిపోయావని?
సైకిల్ మీద మిస్సైల్ ను మోసుకువెళ్లే దగ్గర నుండి మొదలైంది మీ అంతరిక్ష ప్రయాణం..
ఒక శాటిలైట్ ను ఎడ్లబండి మీద తెచ్చి ప్రయోగం చేస్తుంటే, వీళ్ళ బతుకులు ఇంకా ఎద్దులు, దున్నపోతులు, ఏనుగుల మీదే నడుస్తుందని నవ్వుకున్నాయి కొన్ని "బలిసిన దేశాలు"
మీరెక్కడా తగ్గలేదు..
1975 లో ఆర్యభట్టుడితో మొదలైంది మీ విజయం..
ఈనాటి దాకా చేసిన 106 ప్రయోగాల్లో కేవలం 11 మాత్రమే విఫలం చెందాయి.
ఇక్కడ దాదాపుగా 90% success rate సాధించి, ప్రపంచరికార్డు సొంతం చేసుకున్న ఒకే ఒక్క దేశం మనది!
130 కోట్ల జనాభా కోసం నిద్రలేని రాత్రుళ్ళు గడిపారో, ఎందరు కుటుంబాలను వదులుకున్నారో, ఎందరు తమ జీవితాలను త్యాగం చేశారో అది మీకే తెలుసు!
ఈరోజు మేము క్రికెట్ చూస్తున్నా, టీవీల్లో సీరియల్స్ చూస్తున్నా, youtube లో videos చూస్తున్నా, online లో book చేయాలన్నా, ola cab లో వెళ్లాలన్నా, చివరికి తినడానికి uber eats, zomato లు పనిచెయ్యాలన్నా.. మీ దయాదాక్షిణ్యాలే!
మనదేశం క్రికెట్ లో ఓడిపోతే, గుండెలు ఆగిపోయిన వీరాభిమానులే కాదు..
ఉదయం 5 దాకా Live లో మీ చంద్రయాన్ 2 ప్రయోగాలను చూసే నాలాంటి పిచ్చోళ్ళుకూడా ఉన్న దేశం మనది!
నమ్మి పనిచేసిన కల్పనాచావ్లా లాంటి వాళ్ళను నెత్తురుకక్కిస్తూ నేలకు రాల్చే NASA కాదు మనది..
అబ్దుల్ కలాం లాంటి మహానుభావుల ప్రయోగాలతో నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగసే ISRO మనది!
పోతే పోనీ... ఒకటే కదా!
నువ్వు రాల్చిన ప్రతీ కన్నీటి చుక్కను కసిగా మలచి, ఇంధనంగా మండించు!
మీకు మేమున్నాం..
మీతో మేమున్నాం...
మీవెంటే మేమున్నాం..!
జయహో ISRO..!
®️🛰🚀
-చందుగోనెల

0 కామెంట్‌లు