మరోసారి టీవీ హోస్ట్ గా మారబోతున్న జగ్గూభాయ్


మరోసారి టీవీ హోస్ట్ గా మారబోతున్న జగ్గూభాయ్


ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ కేరక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే.. అందరూ ముక్త కంఠంతో అంటారు జగపతిబాబు అని. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విలన్ గానూ, కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ .. తన పొటన్షియాలిటీని చాటుకుంటూ.. నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు మహిళా ప్రేక్షకుల మనసుల్లో మరో శోభన్ బాబు గా ముద్ర పడ్డ ఆయన.. ఇప్పుడు బీజీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాంటి జేబీ త్వరలో బుల్లి తెర మీద కూడా సత్తా చాటుకోబోతున్నారు.
ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, యన్టీఆర్ , నానీ ,రానా,  బ్రహ్మానందం, ఆలీ లాంటి వాళ్ళంతా బుల్లి తెరమీద హోస్ట్ లుగా రక్తికట్టించిన సంగతి తెలిసిందే. అయితే వీరందరికన్నా ముందు జగపతి బాబు ఒక టీవీలో ప్రసారమైన ఒక ఫ్యామిలీ షో కు హోస్ట్ గా ఫస్ట్ టైమ్ బుల్లి తెరమీద మెరిశారు. ఇప్పుడు మరోసారి జగపతి బాబు టీవీలో హోస్ట్ గా రానుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
త్వరలోనే ఒక ఛానల్ లో ప్రసారం కానున్న ఒక రియాలిటీ టీవి షో లో జగపతి బాబు తనదైన శైలిలో హోస్ట్ గా అదరగొట్టనున్నారని సమాచారం. చివరగా చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించి పేరు తెచ్చుకున్నజగపతి బాబు.. ప్రస్తుతం సౌత్ లో పలు భాషల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన హోస్ట్ గా ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. 
Disclaimer: The views, thoughts and opinions expressed in the article belong solely to the author and not to RozBuzz.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు