జరిమానా మార్చండి : ఫొటో బాగా చూడండి సార్.. మేం ఇద్దరమే.. ముగ్గురం కాదు..

ఒక్క ఫొటో వంద భావాలను చెబుతుంది అంటారు.. ఈ ఫొటో మాత్రం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతోపాటు నెటిజన్లకు పరీక్ష పెట్టింది. రెగ్యులర్ గా చూస్తే బైక్ పై ట్రిపుల్ రైడింగ్ అనుకుంటాం.. పరిశీలించి చూస్తే మాత్రం కాదు కాదు.. అంటారు. ఇలాగే కన్ఫ్యూజ్ అయ్యారు ట్రాఫిక్ పోలీసులు సైతం.

ఫొటో కథ ఏంటీ :
మహ్మద్ ముబీన్, అతని స్నేహితుడు బైక్ పై వెళుతున్నారు. 2019, జూన్ 13వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో. సిగ్నల్ దాటి వెళుతున్న సమయంలో మునీబ్ బైక్ కు ట్రాఫిక్ కెమెరాకు చిక్కింది. అంతే పోలీసులు ట్రిపుల్ రైడింగ్ కింద చలానా పంపించారు. ఫొటో చూస్తే అలాగే అనుకుంటారు. కానీ వాస్తవం అది కాదు. బైక్ పై ఉన్నది ఇద్దరే. మరి మూడో వ్యక్తి ఎలా వచ్చాడు.. ఈ విషయాన్ని ముబీన్ స్వయంగా చెబితేనే తెలిసింది.

ఇంతకీ మూడో వ్యక్తి సంగతి ఏంటంటే :
రోడ్డుపై బైక్స్ వెళుతున్నాయి. ట్రాఫిక్ కెమెరా రోడ్డును సైడ్ లో ఉంది. ముబీన్ బైక్ కంటే కొంచెం ముందుగా మరో మరో వ్యక్తి హెల్మెట్ తో బైక్ పై వెళుతున్నారు. ముబీన్ బైక్ పక్కన ఉన్న బైక్ పై వ్యక్తితో సహా ఫొటో క్లిక్ అంది. అంతే ఫొటో ఆధారంగా ట్రిపుల్ రైడింగ్ గా కనిపించింది. ఒక్కసారి ఫొటోను పరిశీలనగా చూస్తే మీకే అర్థం అవుతుంది.

సైబరాబాద్ పోలీసులకు ముబీన్ ట్విట్ :
జూన్ 26వ తేదీన ముబీన్ కు ట్రిపుల్ రైడింగ్ కింద చలానా వచ్చింది. రూ.1,200 కట్టాలని నోటీస్ ఇచ్చారు. అప్పుడు అర్థం అయ్యింది ముబీన్ కు అసలు విషయం. ఫొటోను ట్విట్ చేశాడు. సార్ మేం ఇద్దరమే.. ముగ్గురం కాదు.. అయితే పోలీసులు ట్రిపుల్ రైడింగ్ కింద చలానా ఇచ్చారు.. దగ్గరగా పరిశీలించి చూడండి సార్ మేం ఇద్దరమే అంటూ చెప్పుకొచ్చాడు.

పోలీసులకు చిక్కితే వదులుతారా : ఫైన్ మార్చారు :
ముబీన్ ట్విట్ చేసిన ఫొటో చూసిన పోలీసులు.. నిజం ఒప్పుకున్నారు. నిజమే ట్రిపుల్ రైడింగ్ కాదు.. మరి హెల్మెట్ ఎక్కడ అని ప్రశ్నించారు. ట్రిపుల్ చలానా తీసేసి.. హెల్మెట్ లేనిదానికి ఇస్తాం.. ఫైన్ కట్టు అన్నారు. దీనికి కూడా ముబీన్ ఓకే అన్నాడు. ఎందుకో తెలుసా.. హెల్మెట్ చలానా 100 రూపాయలు.. అదే ట్రిపుల్ రైడింగ్ కు 1200 కదా.. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుని ముబీన్ ట్విట్ చేశాడు.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ :
దీనిపై నెటిజన్లు ఫన్నీగా ట్విట్స్ చేస్తున్నారు. ఖర్మ ఈజ్ బ్యాక్ అని కొందరు అంటే.. ఫొటో తీస్తున్న సంగతి తెలియకుండా ముందు బైక్ అతను కనీసం తల కూడా దించుకోలేదు అని మరికొందరు ఫన్నీగా వెటకారాలు ఆడారు. మీ బైక్ పక్కనే మరొకరు హెల్మెట్ లేకుండా వెళుతున్నాడు.. వాడికి కూడా ఫైన్ వేయండి అంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి ముబీన్ ట్విట్.. కెమెరా మాయను చెప్పింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు