నటుడు సూర్య మరోసారి విలన్ గా నటించాడా? ఇది వరకే ట్వంటీ ఫోర్ సినిమాలో తన మార్కు విలనిజాన్ని పండించాడు సూర్య. అందులో తనే హీరోగా నటించాడు. ట్రిపుల్ యాక్షన్ చేసి..ఆత్రేయ గా విలన్ పాత్రను అద్భుతంగా పండించాడు సూర్య.
ఆ సినిమా హిట్ అయ్యింది. విలన్ గా సూర్య నటన అంతకు మించి ఆకట్టుకుంది. ఇలాంటి నేపథ్యంలో సూర్య మరోసారి విలన్ గా కనిపించనున్నాడా? అనే సందేహాలు రేకెత్తిస్తూ ఉంది ‘బందోబస్త్’ సినిమా ట్రైలర్.
ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేసిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న టెర్రరిస్ట్ పాత్ర అనే క్లూస్ ఇస్తోంది ఆ సినిమా ట్రైలర్.
ఇందులో మోహన్ లాల్ ఒక ముఖ్య పాత్రలో నటించాడు. ఇంకా భార్య-భర్తలు ఆర్య, సయేషాలు కూడా ఈ సినిమాలో నటించారు. బొమన్ ఇరానీ మరో ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందింది ఈ సినిమా.


0 కామెంట్‌లు